Sridevi-Sobhan Babu OTT Release: ఓటీటీకి వచ్చేస్తోన్న మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల చిత్రం!

15 Mar, 2023 16:53 IST|Sakshi

నటుడు సంతోష్‌ శోభన్‌, నటి గౌరి జి. కిష‌న్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల‌ దర్శకుడు. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 30 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది.

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరులో జరిగిన అందమైన ప్రేమకథాగా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.  ఈ చిత్రంలో మెగా బ్రదర్‌ నాగబాబు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్‌ శ్రీదేవి ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌. తన మేనత్తపై ప్రతీకారంతో అరకు వెళ్లిన ఆమె అక్కడ హీరో శోభన్‌ బాబును కలుసుకుంటుంది. ఆ తర్వాత శ్రీదేవి జీవితం ఎలా మారింది? అత్తపై ఆమె ప్రతీకారం తీర్చుకుందా? గతంలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు వంటి ఆసక్తికర సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది. 

మరిన్ని వార్తలు