Vikrant Rona Movie: కరోనా కల్లోలం.. మరో పాన్​ ఇండియా చిత్రం వాయిదా

27 Jan, 2022 21:14 IST|Sakshi

Sudeep Vikrant Rona Movie Postponed: కరోనా మహమ్మారి కలకలం ఇండియాలో తగ్గట్లేదు. రోజురోజుకీ కేసులు పెరుగుతూ విజృంభణ కొనసాగిస్తుంది. వైరస్ విలయంతో పెద్ద సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్​లో విడుదల కావాల్సిన 'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్'​ వంటి పాన్​ ఇండియా చిత్రాల విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా మరో పాన్​ ఇండియా మూవీ రిలీజ్​ పోస్ట్​పోన్ అయింది. కన్నడ స్టార్​ సుదీప్​ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'విక్రాంత్​ రోణ'. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్​ భండారి దర్శకుడు. 

కరోనా తీవ్రత, పరిస్థితులు, థియేటర్లలో పూర్తిగా లేని ఆక్యుపెన్సీ వంటి నిబంధనల కారణంగా 'విక్రాంత్ రోణ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్​. అయితే ఓటీటీలో భారీ ఆఫర్​ వచ్చినా ప్రేక్షకులకు థియేట్రికల్​ అనుభూతిని ఇవ్వాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో నీతా అశోక్​, జాక్వెలిన్ ఫెర్నాండేజ్​ కీలకపాత్రలో నటించారు. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్​.


 

మరిన్ని వార్తలు