యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

21 Dec, 2021 00:17 IST|Sakshi

సుధీర్‌ బాబు హీరోగా కొత్త సినిమా షురూ అయింది. రచయిత, నటుడు హర్షవర్ధన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్‌ రావు క్లాప్‌ కొట్టి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. సుధీర్‌ బాబు సరికొత్తగా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా.

మరిన్ని వార్తలు