Suhasini Maniratnam: తెలుగు సినిమాలు చేయడం అలవాటుగా మారింది

19 Dec, 2023 17:12 IST|Sakshi

నా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయపజయాలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడే తొలి చేస్తున్నా అనే అనుభూతితో ‘మహతి’ చేశాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు ఉన్నాయి’ అని సీనియర్‌ నటి సుహాసిని మణిరత్నం అన్నారు.

సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివ ప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో  శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న చిత్రం 'మాహతి'. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఒక అలవాటుగా మారింది. ‘మహతి’లాంటి మంచి చిత్రంతో కెరీర్‌ పరంగా 44వ ఏడాదిని ప్రారంభిస్తున్నాను. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో ఉండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం’ అని అన్నారు. 

డైరెక్టర్ శివ  ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారు.సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా ఉంది’అని హీరో సందీప్‌ మాధవ్‌ అన్నారు. ‘మహతి కథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’అని నటి దీప్సిక అన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు