సస్పెన్షన్ల వేళ.. నితిన్ గడ్కరీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

19 Dec, 2023 17:29 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసుపై ఉభయ సభల్లో గత రెండు మూడు రోజులుగా గందరగోళం నెలకొంటోంది.  దుండగుల చొరబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని విపక్షాలు పట్టుబడటంతో సభకు ఈ రోజు కూడా అంతరాయం జరిగింది. నేడు లోక్‌సభలో 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేరళలోని జాతీయ రహదారి-65ను పూర్తి చేసినందుకు గాను నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు.

'కాళకుటం నుంచి కరోడ్ వరకు ఎన్‌హెచ్-65ను పూర్తి చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్వవాదాలు. తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు లైన్ల రహదారికి భవిష్యత్‌లో ఇది అనుసంధానం అవుతుంది. ఈ రహదారి అభివృద్ధి పనులను నేనే ప్రారంభించాను. ఓవర్‌పాస్‌లు, ట్రాఫిక్ లైన్లు, మెరుగైన అనుసంధానం కోసం నియోజక వర్గం ప్రజల అభ్యర్థనల మేరకు కేంద్ర మంత్రిని కలిశాను. సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.' అని శశిథరూర్ ట్వీట్ చేశారు. మంగళవారం సస్పెన్షన్‌ అయిన ఎంపీల్లో శశిథరూర్ కూడా ఒకరు.    

ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు

>
మరిన్ని వార్తలు