వేదాంతం రాఘవయ్య

1 Sep, 2020 06:30 IST|Sakshi

హీరోగా పలు సినిమాలు చేశారు సునీల్‌. ఇటీవలే మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించారు. మరోసారి హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘వేదాంతం రాఘవయ్య’ అనే చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేశ్‌’ చిత్రాన్ని ఈ బ్యానరే నిర్మించింది. ఆ అనుబంధంతో ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్‌. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా ప్రకటించలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా