న‌టి సెల్ఫీ: అస్స‌లు బాగోలేదంటున్న నెటిజ‌న్లు

18 Aug, 2020 11:49 IST|Sakshi

సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఎప్పుడూ త‌మ ఫొటోలను, వీడియోల‌ను పంచుకుంటూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటారు. అలాగే బాలీవుడ్ న‌టి స్వ‌స్తిక ముఖ‌ర్జీ కూడా తాజాగా ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. 'ఎగ‌ర‌డానికి నాకు రెక్క‌లు అవ‌స‌రం లేదు. అసంపూర్తిగా డిజైన్ చేసిన‌ నా త‌ల స‌రిపోతుంది'' అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ ఫొటోలో ఆమె స‌గం గుండుతో, మ‌రో సగం ముఖంపై వాలి ఉన్న జుట్టుతో క‌నిపించారు. అయితే ఈ లుక్ ఆమె అభిమానుల‌ను ఆక‌ట్టుకోగా మ‌రికొంద‌రికి మాత్రం అస్స‌లు న‌చ్చ‌లేదు. (సుశాంత్‌ ఆత్మహత్య : ఫేక్‌ సంతాపాలు అవసరమా?)

"నీ హెయిర్‌స్టైల్ బాగుంది కానీ, ఎందుకో నువ్వు మాత్రం చూడ‌టానికి అస్స‌లు బాగోలేవు. ఎందుకంటే మేక‌ప్ వేసుకోలేదు, కనీసం ఫిల్ట‌ర్ ఆప్ష‌న్ కూడా ఉప‌యోగించ‌లేదు" అని ఓ వ్య‌క్తి కామెంట్ చేశాడు. దీనికి న‌టి స్పందిస్తూ.. "బ్యాడ్‌గా ఉన్నానా? అంద‌విహీనంగా క‌నిపించడం కూడా సంతోషంగానే ఉంది" అని పాజిటివ్ రిప్లై ఇచ్చారు. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన స‌ద‌రు నెటిజ‌న్‌ "అయ్యో.. నేను ఆ కోణంలో అన‌లేదు. ఏదేమైనా నా మాట‌లు త‌ప్పుగా ధ్వ‌నించినందుకు నాకు గిల్టీగా ఉంది. మీరు చాలా అందంగా ఉన్నారు" అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. కాగా స్వస్తిక.. డోలీ మెహ్రగా "పాతాళ్ లోక్" వెబ్ సిరీస్‌లోనూ న‌టించారు. "దిల్ బేచారా" చిత్రంలో చివ‌రి‌సారిగా క‌నిపించారు. ఆమె న‌టించిన‌ "తాషెర్ ఘావ‌ర్" అనే బెంగాలీ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. (నేను హీరోను కాదు.. కేవలం: సోనూ సూద్‌)

మరిన్ని వార్తలు