ప్రస్తుతం ఆ భయాలు తగ్గాయి: తమన్నా

11 Feb, 2023 00:55 IST|Sakshi

వీలు కుదిరినప్పుడల్లా కొన్ని రోజులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు తమన్నా. గత ఏడాది వైష్ణవీ దేవి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఇటీవల ఆమె హిమాలయాలకు వెళ్లి అక్కడి వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తమన్నా కాషాయ వస్త్రాలు ధరించారు. ఈ హిమాలయా యాత్రకు సంబంధించిన ఓ వీడియోను తమన్నా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

‘‘ఓ ఆహ్వానం మేరకు హిమాలయాలకు వచ్చాను. ఇక్కడి లింగభైరవి దేవి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశాను. నాకు ప్రశాంతతతో కూడిన మానసిక ఉల్లాసం కలిగింది. జీవితం, అపజయాలు, మరణం పట్ల నెలకొని ఉండే భయాలు తగ్గాయనిపిస్తోంది. లింగభైరవి దేవి విగ్రహం నా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని అనిపించింది’’ అని పేర్కొన్నారు తమన్నా. ఇక సినిమాల విషయానికొస్తే.. రజనీకాంత్‌ ‘జైలర్‌’, చిరంజీవి ‘బోళా శంకర్‌’, దిలీప్‌ ‘బాంద్రా’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారామె.

మరిన్ని వార్తలు