దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం!

5 Nov, 2023 07:31 IST|Sakshi

ఇది మన దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ గ్రామంలో సోన్‌ నదీ తీరానికి చేరువలో పౌంరా పహాడ్‌ కొండ మీద కొలువై ఉన్న ఈ దేవాలయం క్రీస్తుశకం 108 సంవత్సరం నాటిది. ఇది శాక్తేయ ఆలయం. ఇందులో కొలువై ఉన్న దుర్గాదేవిని ముండేశ్వరీదేవిగా పిలుస్తారు. అందువల్ల ఈ ఆలయం ముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఇదే ఆలయంలో శివుడు మండలేశ్వరుడిగా కొలువై పూజలందుకుంటున్నాడు.

అసలు ఇక్కడి ముండేశ్వరి మొదటి పేరు మండలేశ్వరి అని, ముండుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల ముండేశ్వరి అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ పురాతన ఆలయాన్ని 1915 సంవత్సరం నుంచి భారత పురాతత్త్వ శాఖ పరిరక్షిస్తూ వస్తోంది. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. 

(చదవండి: ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా శరీరాన్ని 20కి పైగా మార్పులు..)

మరిన్ని వార్తలు