Tamannah Bhatia : 'నా పని అయిపోయిందనుకున్న సమయంలో అలాంటి అవకాశాలు'

24 Dec, 2022 08:59 IST|Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నాది నటిగా రెండు దశాబ్దాల పయనం. ఈ సుదీర్ఘ పయనంలో కథానాయకిగా తమన్నా అన్ని రకాల పాత్రలను చేశారు. నట ప్రయాణం బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వయా టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 35 ఏళ్ల ఈ బ్యటీ ఇప్పటికీ వెస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. కాగా ఇటీవల పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తమన్నా భాటియా ఒక భేటీలో పేర్కొంటూ తాను ముంబయిలో ప్లస్‌–2 చదువుకుంటున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేశానని చెప్పారు.

అప్పుడు తన వయసు 15 ఏళ్లని, మొదటిగా సాంద్‌ సా రోషన్‌ షహానా అనే హిందీ చిత్రంలో నటింనట్లు పేర్కొన్నారు. అది ప్లాఫ్‌ అయ్యిందని, ఆ తరువాత అదే ఏడాది తెలుగులో నటింన శ్రీ చిత్రం కూడా సక్సెస్‌ కాలేదని చెప్పారు. దీంతో తన పని అయిపోయిందని భావించానన్నారు. అలాంటి సమయంలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రం ఘన విజయంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయన్నారు.

అలా తెలుగు, తమిళం భాషల్లో పలు ప్రముఖ హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. మధ్యలో ఐటెం సాంగ్స్‌లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇంకా మంచి మంచి కథా పాత్రల్లో నటించి అభిమానులను సంతోషపరచాలన్నదే తన కోరికని తమన్నా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు