నిర్మాతలకు ఆర్థికసాయం కోసం విరాళాల సేకరణ

8 May, 2021 08:01 IST|Sakshi

చెన్నై : తమిళ చిత్ర నిర్మాతల మండలి విరాళాలు సేకరిస్తోంది. స్థానిక అన్నాశాలైలో గురువారం మండలి కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గం కొన్ని తీర్మానాలను చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. తొలిసారిగా శాసనసభ్యుడిగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో నిర్మాతలను ఆర్థిక సాయంతో ఆదుకోవడానికి నిధిని సేకరించాలని నిర్ణయించారు. సేవ దృక్పథం కలిగిన వారు ఆర్థిక సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిర్మాతల మండలి కోశాధికారి ఎస్‌. చంద్రప్రకాష్‌ జైన్‌ రూ.10 లక్షల సాయాన్ని  అందించారు. విడుదలలో సమస్యలను ఎదుర్కొంటున్న చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ ఫాంలో విడుదల చేయడానికి సహకరించాలని తీర్మానం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు