హైదరాబాద్‌లో హీరో శింబు కొత్త చిత్రం షూటింగ్‌

1 Nov, 2022 10:13 IST|Sakshi

తమిళసినిమా: వెందు తనిందదు కాడు వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం తరువాత నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పత్తుతల. నటి ప్రియభవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రతి నాయకుడిగా దర్శకుడు గౌతమ్‌మేనన్‌ నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కన్నడంలో శివరాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన మఫ్టీ చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం.

అక్కడ ఈ చిత్రం విజయం సాధించింది. కాగా కన్నడంలో శివరాజ్‌ కుమార్‌ నటించిన పాత్రను తమిళంలో శింబు పోషిస్తున్నారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ను పెట్టుకోవడం కోసం సీక్రెట్‌ పోలీస్‌ చేసే ప్రయత్నం ఈ చిత్ర ప్రధాన కథ. కాగా పత్తు తల చిత్ర షూటింగ్‌ ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, కన్యాకుమారి, బళ్లారి, శివగంగ జిల్లాలోని కారైక్కుడి, కోవిలూర్‌ వంటి ప్రాంతాల్లో నాలుగు షెడ్యూ ల్‌ పూర్తి చేసుకుంది.

తాజాగా ఐదో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుపుకుంటుంది. ఈ చిత్రం కోసం అక్కడ భారీ సెట్టును వేసి నటుడు శింబుపై పాటను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు అధికంగానే నెలకొన్నాయి. కాగా చిత్రాన్ని డిసెంబర్‌ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు