రహస్యాలెన్నో.. 

9 Dec, 2023 03:33 IST|Sakshi
శ్రీనివాస్‌ గోపిశెట్టి, ప్రియదర్శి 

‘కాలగర్భంలో కలిసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే అందులో ఊహకందని రహస్యాలెన్నో!’ అనే వాయిస్‌ ఓవర్‌తో మొదలవుతుంది ‘తంత్ర’ సినిమా టీజర్‌. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అనన్యా నాగళ్ల, సలోని, ‘టెంపర్‌’ శీను ఇతర ప్రధాన పాత్రధారులు.

శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వంలో నరేశ్‌బాబు. పి, రవి చైతన్య నిర్మిస్తు్తన్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ‘‘ఇందులో దుష్టశక్తి బారిన పడిన అమ్మాయి పాత్రలో అనన్య, తాంత్రికుడిగా ‘టెంపర్‌ శీను’, ఓ మిస్టీరియస్‌ పాత్రలో సలోని కనిపిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు