Mojor Movie Team: రియల్‌.. రీల్‌: మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌కు నివాళిగా..

16 Mar, 2022 01:06 IST|Sakshi
తల్లిదండ్రులతో అమరవీరుడు సందీప్‌

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మేజర్‌’. టైటిల్‌ రోల్‌లో అడివి శేష్‌ నటించారు. శశికిరణ్‌ తిక్క దర్శకుడు. మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదలవుతోంది. మార్చి 15న మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జయంతి. ఆయనకు నివాళిగా ‘మేజర్‌’ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది.

సందీప్‌ రియల్‌ లైఫ్‌లోని వివిధ దశలను చూపడమే కాకుండా, రీల్‌ కోసం ఆ పాత్రను అడివి శేష్‌తో చిత్రీకరించిన దృశ్యాలను చూపించారు. ‘‘తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన చిత్రం ‘మేజర్‌’. ఈ చిత్రంలో మేజర్‌ సందీప్‌ బాల్యం, యుక్త వయస్సు, సైన్యంలో చేరినప్పటి నుంచి ముంబై దాడి వంటివి ఉంటాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

మరిన్ని వార్తలు