22 ఏళ్ల కెరీర్.. టాలీవుడ్‌లో కేవలం నాలుగే సినిమాలు చేసిన హీరోయిన్!

23 Jan, 2024 19:18 IST|Sakshi

మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్‌లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్‌ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్‌లో అలా వచ్చి.. ఇలా గుడ్‌ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. 

కేరళలోని త్రిసూర్‌లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్‌ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్‌ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్‌ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్‌లు రావడంతో టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. 

నిర్మాతతో ప్రేమ పెళ్లి

అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్‌తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ..  2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.  ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. 

A post shared by Bhavana🧚🏻‍♀️Mrs.June6 (@bhavzmenon)

A post shared by Bhavana🧚🏻‍♀️Mrs.June6 (@bhavzmenon)

>
మరిన్ని వార్తలు