Anchor Suma: యాంకరింగే కాదు.. సేవలోనూ ముందే..!

25 Dec, 2023 19:06 IST|Sakshi

టాలీవుడ్‌లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. 

అయితే సుమ యాంకరింగ్‌తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ పేరుతో ఆమె సేవలందిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చిందంటే తన వంతు సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిస్‌మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు సాయం అందజేసినట్లు సుమ వెల్లడించారు. ఈ విషయంలో నాట్స్ సహకారం గొప్పదని సుమ తెలిపారు.

కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బబుల్‌ గమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది.

>
మరిన్ని వార్తలు