Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?

25 Dec, 2023 19:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి.  టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్‌పోన్‌ అయిన విషయం తెలిసిందే.

తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పరీక్ష తేదీ రీ షెడ్యూల్ చేస్తారా.. లేక కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది సర్వీస్‌ కమిషన్‌ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలపై రివ్యూ చేసిన ప్రభుత్వం.. గ్రూప్ ఎగ్జామ్స్‌పై స్పష్టత ఇవ్వలేదు. కాగా తెలంగాణలో గ్రూప్-2కు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని మోదీతో భేటీ

>
మరిన్ని వార్తలు