We Love Bad Boys Review In Telugu: 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

8 Mar, 2024 19:36 IST|Sakshi
Rating:  

టైటిల్: వీ లవ్ బ్యాడ్ బాయ్స్

నటీనటులు: బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ తదితరులు

నిర్మాణసంస్థ: బీఎం క్రియేషన్స్

నిర్మాత: పప్పుల కనకదుర్గా రావు

దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్రసాద్ 

మంచి ఎమోషన్స్‌తో అవుట్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్'. ఈ చిత్రం నేటి యువత, ప్రేమకు అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాను ఎమోషనల్‌గా మలిచినా కూడా మన మూలాల్ని చూపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు, యువత తప్పకుండా చూడదగ్గ చిత్రంగా థియేటర్లోకి వచ్చింది.

బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పోసానీ కృష్ణ మురళీ, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, శివా రెడ్డి వంటి వారు ఇతర కీ రోల్స్ పోషించారు. బీఎం క్రియేషన్స్ బ్యానర్ మీద పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన  ఈ చిత్రానికి రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

అసలు కథేంటంటే.. 

ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్‌మేట్స్ పైగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ ఆ ముగ్గురి ప్రేమలో పడతారు. అంటే దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు. దీంతో వారి తండ్రి (పోసాని కృష్ణ మురళి) వారు ఇష్టపడ్డ వారితో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రశాంత్, వినయ్ వారిని వివాహం చేసుకోవడానికి విస్మరిస్తారు. ప్రశాంత్, వినయ్ పెళ్లిని ఎందుకు నిరాకరించారు? అసలు ఈ జంటల మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే.. 

నేటి యువతకు సరిపోయేలా ఈ సినిమాను దర్శకుడు ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నేటి యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా.. ఎంతో వినోదభరితంగా సాగుతుంది. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌‌లో ఇటు యూత్‌కి.. అటు పేరెంట్స్‌కి ఇచ్చిన సందేశం అందరినీ కదిలిస్తుంది.

పోలీస్ స్టేషన్ సీన్స్,వేశ్య సన్నివేశం, అలీ ఎపిసోడ్‌లు, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు కడుపుబ్బా నవ్విస్తాయి. దర్శకుడు రాజు రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అందించారు.  ఇది రొటీన్ సినిమా కాబట్టి ఓవరాల్‌గా బాగుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు బాగున్నాయి. 

ఎవరెలా చేశారంటే.. 

అజయ్, వంశీ, ఆదిత్య అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రస్తుత యువత ఈ పాత్రలలో బాగా కనెక్ట్ అవుతారు. రోమికా శర్మ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషిణి సహోతా, ప్రగ్యా నయన్ తెరపై అందంగా కనిపించారు. పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి, శివారెడ్డి  తమ పరిధిలో ఆకట్టుకున్నారు. సాంకేతికత విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎంగేజ్ చేస్తుంది. లొకేషన్స్‌, విజువల్స్ అందంగా కనిపిస్తాయి. అయితే ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.25/5)

Election 2024

మరిన్ని వార్తలు