రష్మిక నేషనల్ క్రష్ కాదు.. ఇక నుంచి ఆమెనే!

5 Dec, 2023 15:26 IST|Sakshi

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ ఒక్క పేరే దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ అవుతోంది. అదేనండీ మన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ. రిలీజైన మొదటి రోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై కొందరు తప్పుపడుతున్నారు. ఇలాంటి సినిమాలను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఇటీవలే టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మండిపడ్డారు. మరోవైపు ఈ చిత్రంపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఆమె పేరే వినిపిస్తోంది. ఈ చిత్రంలో జోయా పాత్రలో నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి. హీరోయిన్ రష్మిక కంటే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని రణ్‌బీర్‌ కపూర్‌తో త్రిప్తి రొమాంటిక్ సీన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్‌, రష్మిక కెమిస్ట్రీ కంటే.. త్రిప్తి దిమ్రి కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.  త్రిప్తినే అసలైన నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిప్తి ఓవర్‌నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుందని అంటున్నారు. రణబీర్‌ కపూర్‌, తృప్తి దిమ్రీల జోడీ భవిష్యత్తులోనూ తెరపై చూడాలనుకుంటున్నట్లు పోస్టులు పెడుతున్నారు. 

కాగా.. ఫిబ్రవరి 23, 1994న ఉత్తరాఖండ్‌లో జన్మించిన తృప్తి డిమ్రీ యానిమల్‌ చిత్రం కంటే ముందే చాలా సినిమాల్లో నటించింది. 'పోస్టర్ బాయ్స్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'కాలా', బుల్ బుల్ లాంటి చిత్రాలకు ప్రశంసలు అందుకుంది. తాజాగా రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్‌లో చేసిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది.

>
మరిన్ని వార్తలు