త్రిష పారితోషికం డబుల్‌.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా?

1 Nov, 2022 06:58 IST|Sakshi

ఒక సక్సెస్‌ వస్తే హీరో హీరోయిన్లు ముందుగా చేసే పని పారితోషికం పెంచడమే. ఇక ఈ విషయంలో నటి త్రిష ఫాస్ట్‌గా ఉంటుందని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ తాజా పరిణామాలే. 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ భామ 23 ఏళ్లుగా కథానాయికగా నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ అమ్మడు నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు ఒకటి కూడా సక్సెస్‌ కాలేదు. అంతేకాదు ఈమె సరైన హిట్‌ చూసి ఐదేళ్లు దాటింది. 2018 తర్వాత త్రిష నటించిన ఒక చిత్రం కూడా సక్సెస్‌ కాలేదు. దీంతో త్రిషకు పే డౌట్‌ నటి అనే ముద్రవేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ సక్సెస్‌తో పాటు  మంచి పేరు వచ్చేశాయి. అవును పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష చాలా హుందాగా నటించారు. దీంతో ఈమెకు ప్రశంసల జల్లు కురిసింది.

గత కొంతకాలంగా నత్తనడక నడుస్తున్న త్రిష సినీ కెరీర్‌ ఇప్పుడు జెట్‌ స్పీడ్‌లో పరిగెడుతోంది. భారీ అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. ఇంకేముంది ఈ బ్యూటీ ఒకసారిగా పారితోషికం పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు రూ.కోటిన్నర దాటని పారితోషికాన్ని ఇప్పుడు డబుల్‌ చేసినట్లు సినీవర్గాల టాక్‌. ప్రస్తుతం ఈమె నటిస్తున్నది రోడ్‌ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. కాగా త్వరలో దళపతి విజయ్‌కి జంటగా ఒక చిత్రంలోనూ, అజిత్‌ సరసన ఒక చిత్రంలోని నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.  

చదవండి: (సమంత 'మయోసైటిస్‌' వ్యాధిపై కీర్తి సురేష్‌ కామెంట్స్‌ వైరల్‌)

మరిన్ని వార్తలు