'తనకేవేవో కలలు.. నేనేమో.. కనెక్షన్‌ మిస్‌ అవుతోంది.. ' భార్యతో విడిపోయిన నటుడు

28 Feb, 2024 12:48 IST|Sakshi

ఈ మధ్య పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. బుల్లితెర జంట అభిషేక్‌ మాలిక్‌- సుహాని చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ 2021లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మీ జంట చూడముచ్చటగా ఉందని, కలకాలం కలిసుండాలని కోరుతూ అతిథులు అక్షింతలు వేసి దీవించారు. కానీ మూడేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారింది. తాము విడిపోయామంటూ నటుడు అభిషేక్‌ వెల్లడించాడు. తమ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

కనెక్షన్‌ మిస్‌ అవుతోంది
అభిషేక్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మనస్వత్వాలు వేరు. మా మధ్య సరైన అండర్‌స్టాండింగ్‌ కూడా లేదు. మా మధ్య ఏదో కనెక్షన్‌ మిస్‌ అవుతున్నాం. దీని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. విడాకులు తీసుకుంటేనే ఇద్దరం సంతోషంగా ఉండలగమని నిర్ణయించుకున్నాం. కలిసి బంధాన్ని కొనసాగించేందుకు మాకు సహేతుక కారణాలేవీ కనిపించట్లేదు. బలవంతంగా కలిసుండి ఒకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? అందుకే విడిపోయాం.

తనకేమో కలలు.. నేనేమో బిజీ
నేను నా వర్క్‌తో చాలా బిజీగా ఉంటున్నాను. తనేమో ఏవేవో కలలు కంటోంది. పైగా తను ముంబైకి కొత్త. ఇక్కడ తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. నా ఫ్రెండ్సే తనకు మిత్రులుగా మారారు. ఇండస్ట్రీకి చెందిన నా స్నేహితులు తనను ఎంతో ప్రేమిస్తారు. నాకంటే తనే ఎక్కువగా వారితో కలిసి బయటకు వెళ్తూ ఉండేది. అయితే ఆ ఫ్రెండ్స్‌ కూడా నేను నా భార్యకు ఎక్కువ సమయం కేటాయించడం లేదని అనేవారు. ఆ మాట నాకు బలంగా గుచ్చుకుంది. అది కాస్తా ఇంతవరకు వచ్చింది. విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశాం' అని చెప్పుకొచ్చాడు.

ప్రేమ పెళ్లి- మూడేళ్లకే విడాకులు
కాగా అభిషేక్‌- సుహాని తొమ్మిదినెలల పాటు డేటింగ్‌ చేసి 2021లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే విడాకులు తీసుకోబోతుండటంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్‌ మాలిక్‌.. ఛల్‌-షే ఔర్‌ మాత్‌ అనే సీరియల్‌తో 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఏక్‌ వివాహ్‌ ఐసా బీ, భాగ్యలక్ష్మి, యే హై మొహబ్బతే, కుంకుమ్‌ భాగ్య వంటి సీరియల్స్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. సుహాని చౌదరి మోడల్‌గా రాణిస్తోంది.

చదవండి: శాలువా ఎందుకు విసిరేశారు? వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి

whatsapp channel

మరిన్ని వార్తలు