హీరో కార్తీకి రూ. కోటి చెక్‌ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్‌.. ఎందుకో తెలుసా?

16 Feb, 2024 12:40 IST|Sakshi

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం ప్రముఖ హీరో విశాల్‌ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019లో నడిగర్​ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించారు. అధ్యక్షుడిగా నాజర్​, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్​, జనరల్​ సెక్రటరీగా విశాల్​, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు.

అసోసియేషన్ భవనం​ నిర్మించడం కోసం నిధుల కొరత ఉందని గతంలో విశాల్‌ తెలిపాడు. నిర్మాణ విషయంలో మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని అందుకు బడ్జెట్‌ కూడా పెరిగిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విశాల్‌ కోరాడు. భవన నిర్మాణ కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని ఆయన అన్నారు. 

తాజాగా నటీనటుల సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రూ. కోటి నిధలు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి ఆర్థిక సాయం చేశారు. కోశాధికారి కార్తీకి ఉదయనిధి స్టాలిన్ ఆ చెక్‌ను అందజేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్న విషయం తెలిసిందే.

ప్రియమైన ఉదయ, మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణ ప్రయత్నాలకు మీ సహకారం అందించడమే కాకుండా ఇలా వీలైనంతలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు స్నేహితుడిగా, నిర్మాతగా, నటుడుగా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఆయన తెలిపాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు