అదీ ప్రభాస్‌ రేంజ్‌: వంద కోట్ల రెమ్యునరేషన్‌!

26 Feb, 2021 13:30 IST|Sakshi

ప్రభాస్‌.. ఈ పేరును నిత్యం జపించే అమ్మాయిలు ఎందరో.. అబ్బాయిలకైతే ఈ పేరు వింటేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఈ టాలీవుడ్‌ హీరో బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన తన రెమ్యునరేషన్‌ను విపరీతంగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాహుబలి సిరీస్‌తో తెలుగు ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన ఈ హీరో ఒక్క సినిమాకు 100 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడట. ఈ విషయం తెలిసి ఖంగుతింటున్నారట దర్శకనిర్మాతలు. మరికొందరు మాత్రం ప్రభాస్‌ కోసం కోట్లు గుమ్మరించడానికైనా రెడీయే అంటున్నారు. అలా ప్రభాస్‌ ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలకు నూరు కోట్లు అందుకున్నాడట. టాలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తం అందుకుంది ప్రభాస్‌ ఒక్కడేనని, దక్షిణాదిలో కూడా ఇంత రెమ్యునరేషన్‌ అందుకున్నవాళ్లెవరూ లేరని ఆయన అభిమానులు అంటున్నారు.

ఇక ప్రభాస్‌ సినిమాల విషయానికొస్తే.. తానాజీ ఫేమ్‌ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌ చేస్తుండగా ఇది వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. అలాగే కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో సలార్‌ చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌తో భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ చేయనున్నాడు. ఇందులో దీపిక పదుకొణె కథానాయికగా నటించనుంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన రాధేశ్యామ్‌ జూలై 30న రిలీజవుతోంది.

చదవండి: రాధేశ్యామ్‌ : ప్రభాస్ కాస్ట్యూమ్స్‌ కోసం 6కోట్లు!

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్‌లు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు