ఓటీటీలో ఈ వారం సందడే సందడి.. ఫ్రైడే ఒక్కరోజే అన్ని సినిమాలు రిలీజ్‌!

18 May, 2023 18:01 IST|Sakshi

థియేటర్‌లో సినిమా రిలీజ్‌ కోసం ఎంత ఎదురుచూస్తున్నారో ఆ మూవీ ఓటీటీలోకి వచ్చే రోజు కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు. కరోనా సమయంలో చిన్నాపెద్దా సినిమాలన్నీ మరో దారి లేక ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి. దీంతో అందరూ ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కానీ ఇప్పటికీ ఓటీటీకి క్రేజ్‌ తగ్గలేదు.

పైగా థియేటర్‌లో మెప్పించని కొన్ని సినిమాలు ఓటీటీలో బాగా క్లిక్‌ అవుతుండటం విశేషం. అలాగే బాక్సాఫీస్‌ దగ్గర జైత్రయాత్ర చేపట్టిన చిత్రాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు కూడా తెరకెక్కుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లేంటో ఓసారి చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌
అయాలవాషి(మలయాళం) - మే 19
కథల్‌: ఎ జాక్‌ఫ్రూట్‌ మిస్టరీ (హిందీ) - మే 19
బయూ అజైబి (ఇంగ్లీష్‌)- మే 19
సెల్లింగ్‌ సన్‌సెట్‌ (ఆరో సీజన్‌)- మే 19
మ్యూటెడ్‌ (ఇంగ్లీష్‌) - మే 19
విరూపాక్ష - మే 21

హాట్‌స్టార్‌
డెడ్‌ పిక్సెల్స్‌ - మే 19

సోనీలివ్‌
ఏజెంట్‌ - మే 19
కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) - మే 19

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
బ్యాక్‌డోర్‌- స్ట్రీమింగ్‌ అవుతోంది
మోడ్రన్‌ లవ్‌ చెన్నై (తమిళ్‌)‌ - స్ట్రీమింగ్‌ అవుతోంది
హే మేరీ ఫ్యామిలీ సీజన్‌ 2 (హిందీ) - మే 19

ఆహా
ఏమి సేతురా లింగ - మే 19
మారుతి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ (తమిళ్‌) - మే 19

జియో సినిమా
లవ్‌ యూ అభి (కన్నడ సిరీస్‌) - మే 19
కచ్చి లింబూ - మే 19
క్రాక్‌ డౌన్‌ సీజన్‌ 2 - మే 20

చదవండి: తనకంటే చిన్నవాడితో లవ్‌.. బ్రేకప్‌ చెప్పిన నటి

మరిన్ని వార్తలు