Varun Dhawan: డ్రైవర్​కు వరుణ్​ భావోద్వేగపు నివాళి.. ఎమోషనల్ అయిన ఫ్యాన్స్

22 Jan, 2022 18:42 IST|Sakshi

Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo: బాలీవుడ్​ యంగ్​ హీరో వరుణ్​ ధావన్ తాజాగా సోషల్​ మీడియా వేదికగా ఎమోషనల్​గా పోస్ట్​ చేశాడు. ఇది చూసిన వరుణ్​​ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ​ఇటీవల వరుణ్​ డ్రైవర్​ మనోజ్​ సాహు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మనోజ్​కు నివాళిగా తన ఇన్​స్టా గ్రామ్​ స్టోరీలో పోస్ట్​ పెట్టాడు వరుణ్​. బీచ్​లో లవ్​ షేప్​లో ఇసుకను పేర్చి అందులో 'మనోజ్​ భాయ్​ మిస్​ యూ సోమచ్​' అని రాశాడు. 

ఈ స్టోరీకి 'అందంగా ఉంది. మనోజ్​ భాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తాడు.' అని ఒక అభిమాని కామెంట్ పెట్టగా 'ఈ పోస్ట్​తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి.' అని మరొకరు రాశారు. వరుణ్​తో 26 ఏళ్లపాటు కలిసున్న మనోజ్​ సాహు మంగళవారం గుండెపోటుతో మరణించారు. వరుణ్​ వెళ్లిన ఒక యాడ్​ షూట్​కు తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. 

మరిన్ని వార్తలు