ఫినిషింగ్‌ టచ్‌కు ‘గని’రెడీ.. ఫైనల్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌

10 Jul, 2021 14:47 IST|Sakshi

వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌ బాగానే కష్టపడుతున్నాడు. జిమ్‌కెళ్లి కండలు పెంచడమే కాకుండా..  బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. అందులో వరుణ్ తేజ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను ప్రారంభినట్టుగా తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు