గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది

19 Dec, 2023 00:39 IST|Sakshi
వరుణ్‌ తేజ్,మానుషీ చిల్లర్‌

వరుణ్‌ తేజ్, మానుషీ చిల్లర్‌ జంటగా నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌దేవ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారు. రాడార్‌ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్‌ నటించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, సందీప్‌ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

సోమవారం ‘ఫస్ట్‌ స్ట్రైక్‌’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబోస్‌ది కూడా..’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ (వరుణ్‌ తేజ్‌) వంటి డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. ‘‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ మూవీ కథనం ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు