బాక్సర్‌ ఇన్‌ యాక్షన్‌

21 Nov, 2020 01:26 IST|Sakshi

వరుణ్‌ తేజ్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉన్నారు. ఇంకొన్ని రోజులు ఇదే మూడ్‌లో ఉంటారట. ఇదంతా సినిమా కోసమే. వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తారు వరుణ్‌. ఈ చిత్రానికి ‘బాక్సర్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తు్తన్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారని టాక్‌. మరో పదిరోజల పాటు ఈ షెడ్యూల్‌ సాగనుందట. ఆ తర్వాత తన సోదరి నిహారిక పెళ్లి కోసం వరుణ్‌ తేజ్‌ చిన్న బ్రేక్‌ తీసుకుంటారు. 

మరిన్ని వార్తలు