‘నారప్ప’ ట్రైలర్‌... వెంకటేశ్‌ అదరగొట్టేశాడుగా

14 Jul, 2021 12:44 IST|Sakshi

విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. తమిళ మూవీ ‘అసురన్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్రీమింగ్‌ కానుంది.

ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.. ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచేశాయి. ‘నారప్ప’గా వెంకటేశ్‌ అదరగొట్టేశాడు. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. మణిశర్మ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది.  ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలకపాత్రలు పోషించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు