తీవ్ర మనస్తాపం చెంది.. యువకుడు విషాద నిర్ణయం..!

9 Nov, 2023 09:18 IST|Sakshi
వెంకటేశ్(ఫైల్)

సాక్షి, కరీంనగర్: వేములవాడ మండలంలోని మల్లారం గ్రామం రాజానగర్‌కు చెందిన గొర్రె వెంకటేశ్‌ (35) కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మారుతి తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్‌ పదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన వెంకటేశ్‌ బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: చింతకాయలు తెంపుతుండగా.. కట్టుకున్న లుంగీ మెడకు చుట్టుకుని.. ఆపై..

మరిన్ని వార్తలు