మ‌రీ అంత దరిద్రంగా లేను: హీరోయిన్‌

16 Sep, 2020 17:32 IST|Sakshi

ఫొటో చూస్తుంటేనే తెలుస్తోంది ఇది ఎన్నో ఏళ్ల క్రితం నాటిద‌ని. కానీ మలయాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ అప్ప‌టికీ ఇప్ప‌టికీ అలానే ఉన్నారు. కాక‌పోతే ఆ ప‌క్క‌న ఉన్న అమ్మాయి మాత్రం ఇప్పుడు కాస్త బొద్దుగా, ముద్దుగా మారిపోయింది. ఇంత‌కీ ఆమెవ‌రనుకుంటున్నారు, బాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న‌ హీరోయిన్ విద్యాబాల‌న్‌. మ‌ల‌యాళంలో ఆమె న‌టించిన‌ తొలి చిత్రం షూటింగ్ స‌మ‌యంలో తీసిన ఫొటో ఇది. దీన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ అభిమానుల‌తో పంచుకున్నారు. (బరువు తగ్గాలమ్మాయ్‌ అన్నారు!)

"అది 2000 సంవ‌త్స‌రం. నేను మోహ‌న్‌లాల్‌తో క‌లిసి న‌టించిన తొలి మ‌ల‌యాళ చిత్రం చ‌క్రం షూటింగ్ స‌మ‌యంలో దిగిన ఫొటో ఇది. కానీ మొద‌టి షెడ్యూల్ ముగిసిన త‌ర్వాత ఆ సినిమా అర్థాంత‌రంగా  ‌ఆగిపోయింది.. చూస్తుంటే ఈ ఫొటోలో నేను అనుకున్నంత ద‌రిద్రంగా ఏమీ లేను" అని విద్యాబాల‌న్‌ రాసుకొచ్చారు. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా విద్యాబాల‌న్ 'భాలో టేకో' అనే బెంగాలీ చిత్రంతో వెండితెర‌పై ప్ర‌వేశించారు. ఈ సినిమా విడుద‌లైన రెండేళ్ల‌కు, అంటే 2005లో న‌వ‌ల ఆధారంగా నిర్మిత‌మైన‌ 'ప‌రిణీత' చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేశారు. ఆ త‌ర్వాత‌ ప‌లు భాష‌ల్లో న‌టిస్తూ గొప్ప న‌టిగా ఎదిగారు. ఆమె చివ‌రిసారిగా మ‌హిళా ప్ర‌ధాన చిత్రం 'శ‌కుంత‌ల దేవి'లో న‌టించారు. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల నుంచే కాక విమ‌ర్శ‌కుల నుంచి కూడా మెప్పును పొందింది. కాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న 'స‌ర్కారువారి పాట'‌లో హీరో అక్క క్యారెక్ట‌ర్ కోసం విద్యాబాల‌న్‌ను సంప్ర‌దించార‌ని స‌మాచారం. (ప్రణవ్, కల్యాణి లవ్‌లో ఉన్నారా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా