రౌడీ ఫ్యాన్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన చార్మీ

17 Jan, 2021 21:02 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఫైటర్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రేపే(సోమవారం) రివీల్ చేస్తున్నామని చార్మీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ పెట్టిన ఆమె.. ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులతో పంచుకున్నారు.  

బాక్సింగ్‌ రింగ్‌లో పాయింట్లు చూపించినట్లుగా ఆ పోస్టర్‌ ఉంది. అందులో చేతిక ధరించే గ్లౌవ్స్ ఉన్నాయి. రేపు ఉదయం 10.08నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రాబోతోందని తెలిపారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని వార్తలు