బన్నీ రికార్డు బ్రేక్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

2 Sep, 2021 17:58 IST|Sakshi

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రత్యేకంగా యూత్‌లో  విజయ్‌ యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌ను కూడా బాగనే సంపాదించుకున్నాడు. ‘గీతా గోవిందం’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఈ రౌడీ బాయ్‌కి స‌రైన స‌క్సెస్‌లు లేక ఇబ్బంది ప‌డుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటితో సంబంధం లేకుండా సోషల్‌మీడియాలో ఓ అరుదైన రికార్డుని నమోదు చేశాడు విజయ్‌. ఇటీవల నెట్టింట విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు.

టైం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో కమ్యూనికేట్‌ అవుతుంటాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 13 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ సాధించి స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్ల మంది ఫాలోయర్స్‌ సంపాదించుకుంటున్నారు. ఇటీవ‌ల అల్లు అర్జున్ 13 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ని చేరుకున్నాడు. దీంతో సౌత్ ఇండస్ట్రీలోనే ఈ రికార్డును అందుకున్న తొలి కథానాయకుడిగా బన్ని పేరు నమోదు చేయగా, కొద్ది రోజుల‌కే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ రేర్‌ ఫీట్ అందుకోవడం విశేషం.

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం ‘లైగ‌ర్’ చేస్తున్నాడు. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. 

చదవండి: అవినాష్‌ పెళ్లిపై స్పందించిన బిగ్‌బాస్‌ బ్యూటీ..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు