ఆ హౌజ్‌మెట్‌కే నా మద్దతు: విజయ్‌ దేవరకొండ

14 Dec, 2020 12:36 IST|Sakshi

అభిజిత్‌కి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పిన దేవరకొండ

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. మరో వారం రోజుల్లో ఈ షో ముగియనుంది. టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్‌, సోహైల్‌, అభిజిత్‌, హారిక‌, అరియానా ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాల‌న్న క‌సితో ఇంటిస‌భ్యులు గేమ్‌పై ఫోక‌స్ చేస్తున్నారు. అభిమాన కంటెస్టెంట్‌ని ఎలాగైనా గెలిపించాల‌న్న త‌ప‌న‌తో అభిమానులు కూడా ఓట్ల ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా బిగ్‌బాస్‌ హౌజ్‌లో తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకు మద్దుతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన హీరో శ్రీకాంత్)

ఇక హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌.. గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నది ఎవరికంటే అభిజిత్ అనే చెప్పవచ్చు‌. ఈ సీజన్‌ విజేత అతడే అంటూ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది.  ఇక ఇప్పటికే అభిజిత్‌కి నాగబాబు వంటి వారు మద్దతివ్వగా తాజాగా ఈ జాబితాలోకి ‘అర్జున్‌ రెడ్డి’ హీరో విజయ్‌ దేవరకొండ చేరారు. అభిజిత్‌కు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్తూ తన సోషల్‌ మీడియాలో ఓ ఫోటోని షేర్‌ చేశారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్’‌ చిత్రం ద్వారా అభిజిత్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో విజయ్‌ దేవరకొండ గోల్డ్‌ ఫేజ్‌ కుర్రాడి పాత్రలో మెప్పించారు. ఈ క్రమంలో విజయ్‌ దేవరకొండ.. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ టీంతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘‘మై బాయ్స్‌.. ఎల్లప్పుడూ వారికి శుభాకాంక్షలు.. ఎక్కడైనా.. ఏదైనా’’ అంటూ​ పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో విజయ్‌ దేవరకొండతో పాటు అభిజిత్‌,  సుధాకర్, అభితో పాటు మరోకరు ఉన్నారు. ఇక అభిజిత్‌కి రౌడీ హీరో మద్దతు కూడా దక్కడంతో అతడి ఫ్యాన్స్‌ ఫుల్లు ఖుషి అవుతున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు