అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చేసింది: నటుడు

9 May, 2021 14:07 IST|Sakshi

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థ్యాంక్‌ యు బ్రదర్‌'. థియేటర్లలో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు ఓటీటీ బాట పట్టక తప్పలేదు. మే 7 నుంచి ఆహాలో ప్రసారమవుతున్న ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో విరాజ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తొలి సినిమాలోనే అనుభవమున్న వ్యక్తిలా నటించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పాజిటివ్‌ రివ్యూలపై విరాజ్‌ అశ్విన్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

అతడు మాట్లాడుతూ.. "నా పాత్ర గురించి చెప్పడం మొదలు పెట్టినప్పుడు నాది నెగెటివ్‌ రోల్‌ అనిపించింది. కానీ డైరెక్టర్‌ రమేశ్‌ రాపర్తి నా పాత్ర గురించి చెప్తూ ఉండే కొద్దీ అది విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి అద్భుతంగా చేశావ్‌ అని చెప్తుంటే మాటలు రావడం లేదు. ఈ కథను డీల్‌ చేయడం అంత ఈజీ కాదు, కానీ డైరెక్టర్‌ దాన్ని విజయవంతంగా తెరకెక్కించాడు"

"ఇక క్లైమాక్స్‌లో నా నటన చూసి అమ్మ నన్ను హత్తుకుని ఏడ్చేసింది. అది నా జీవితంలోనే మర్చిపోలేని జ్ఞాపకం. స్టార్‌ నటి అనసూయతో కలిసి పని చేయడం అంటే మొదట్లో భయమేసింది. కానీ సెట్‌లో అడుగుపెట్టాక ఆ భయం ఎగిరిపోయింది. ఆమె అందరితో సరదాగా, కలివిడిగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. కాగా విరాజ్‌ అశ్విన్‌ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి.

చదవండి: Anasuya Bharadwaj: ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ మూవీ రివ్యూ

నటి కీర్తికి డాక్టర్‌ బాబు ఏమవుతారో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు