Vishnu Vishal: నా భార్యకు సినిమాలంటే ఇంట్రస్ట్‌ లేదు, అదే నా డ్రీమ్‌ రోల్‌!

26 Nov, 2022 19:16 IST|Sakshi

విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. 'ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. 

'మట్టి కుస్తీ' భార్యభర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం.

ఇందులో నేను కబడ్డీ ప్లేయర్‌ను, కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో.. సినిమా చూసినప్పుడు చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది.

'ఎఫ్ఐఆర్' సినిమాను తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజ గారికి చాలా నచ్చాయి. ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆయనకి చాలా నచ్చింది. ఆ సినిమాని ప్రజెంట్ చేశారు. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైయింది. రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు. 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో వున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్, మార్కెట్ గురించి మాట్లాడేవారు. కానీ రవితేజ గారు ఒక్క మీటింగ్‌లో నన్ను సంపూర్ణంగా నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుంది.  

నేను మొదట్లో క్రికెట్‌ను ప్రేమించాను. సినిమాని పెళ్లి చేసుకున్నాను. రెండూ ఇష్టమే. అయితే క్రికెటర్‌గా చేయాలన్నది నా డ్రీమ్‌ రోల్‌. అలాగే సూపర్ హీరో పాత్రని కూడా చేయాలని ఉంది.

ప్రతి ఇండస్ట్రీకి ఒక యూనిక్ నెస్ వుంటుంది. బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతారా , విక్రమ్, పీఎస్ 1 ఇలా అన్ని పరిశ్రమ నుంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు సౌత్‌లో గొప్ప వాతావరణం వుంది. ఇండియన్ సినిమాలో సౌత్ గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. 

► నా భార్య జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది, కానీ నటన పట్ల ఆసక్తి లేదు. ఇదివరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఫీలవుతుంటుంది. ఇంకెప్పుడూ తనని నటించమని అడగొద్దని చెప్పింది( నవ్వుతూ) 

నా నిర్మాణంలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. మోహన్ దాస్ చిత్రం చిత్రీకరణలో వుంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. రజనీకాంత్ గారి లాల్ సలాం చిత్రంలో నటిస్తున్నా.

చదవండి: మార్ఫింగ్‌ ఫొటోలు వైరల్‌.. పోలీసులకు పవిత్ర లోకేశ్‌ ఫిర్యాదు
ఫైమా చేతిలో ఎలిమినేషన్‌, ఎవరు ఎలిమినేట్‌ అవుతారంటే?

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు