వివేక్‌ ఒబెరాయ్‌ భార్యకు నోటీసులు!

16 Oct, 2020 16:40 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వ్యవహారం కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కన్నడ నటీనటులు అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో నిన్న (గురువారం) బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(బీసీసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతేగాక ఆయన భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌కు క్రైం బ్రాంచ్‌  శుక్రవారం నోటీసులు ఇచ్చింది. అయితే డ్రగ్‌ కేసులో కర్ణాటక మాజీ దివంగత మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు అదిత్య అల్వా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్‌ కేసు; వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు)

ఆదిత్య అల్వా స్వయంగా ప్రియాంక అల్వా సోదరుడు, వివెక్‌ ఒబెరాయ్‌కి బావమరిది కావడంతో పోలీసులు ఆయన ఇంటిలో తనిఖీ చేసినట్లు తెలిసింది. అయితే ఆదిత్య పరారీ ఉండటంతొ ఆచూకి కోసం ఇవాళ ప్రియాంకను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ... ‘డ్రగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడు. అతడు నటుడు వివెక్‌ ఒబెరాయ్‌ భార్య ప్రియాంకకు సోదురుడు. అతడి ఆచూకి కోసమే వివేక్‌ ఇంటిలో సోదాలు నిర్వహించాం. అయితే ఆచూకి లభించకపోవడంతో ప్రియాంకను విచారించేందుకు ఇవాళ నోటీసులు జారీ చేశాం’ అని అధికారి చెప్పుకొచ్చారు. (చదవండి: వారికి అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలు..!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు