యదార్థ సంఘటనతో ‘వీకెండ్ పార్టీ’

2 Oct, 2022 10:21 IST|Sakshi

కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిపోయింది. రియాలిటీ చిత్రాలను, రియలిస్టిక్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజ జీవితంలోని ఘటనలు, యథార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి నేపథ్యంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీకెండ్‌ పార్టీ’. నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది.

కథారచయిత అమరుడు డాక్టర్ బోయ జంగయ్య గారి 80వ జయంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాత బోయ చేతన్ బాబు, సినిమా దర్శకులు అమరేందర్ ప్రోమో విడుదల చేశారు. నాగార్జునసాగర్ లో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా, ఈ సినిమా కొనసాగుతూ ఉంటుందని మేకర్లు తెలిపారు. బాహుబలి ప్రభాకర్, గీతా సింగ్, గుంటూరు విజయ్, అక్షిత్ అంగరీష్, రమ్య నాని, రమ్య రాజ్, సిరి, గీతిక, ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సదా చంద్ర సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు