2022 Bollywood Disasters: అలరించని బీటౌన్‌ స్టార్స్‌.. వందల కోట్ల నష్టాలు!

24 Dec, 2022 17:46 IST|Sakshi

బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే..ఖాన్ త్రయం పేరు వినిపిస్తుంది. తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ రేంజ్ చూపిస్తున్నారు. అయితే ఈ ఏడాది బాక్సాఫీసు ముందు వీళ్ల ప్రతాపాలు ఏవీ చెల్లుబాటు కాలేదు. సినిమ టాక్ ఎలా ఉన్నా ఈ స్టార్లు..ఓ మోస్తారు  కలెక్షన్లు రాబడుతుంటారు.  కానీ ఇప్పుడు మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోతున్నారు. వందల కోట్ల నష్టాలు తీసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలై వందల కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేయండి

ఆమిర్ ఖాన్ పేరు చెప్తే..పర్ఫెక్షన్ గుర్తుకు వస్తుంది. ఇంతటి మిస్టర్ పర్ఫెక్షనిస్టు కూడా  ఈ ఏడాది బాలీవుడ్‌కు బలం తీసుకురాలేకపోయాడు. పీకే,దంగల్ లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీసును తిరగరాసిన ఆమిర్‌ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తో గట్టి దెబ్బే తిన్నాడు. క్రిటిక్స్‌తో పాటు..కామన్ ఆడియన్‌..ఈ సినిమాను చూసి పెదవి విరిచేశారు. ఈ ఇ ఏడాదిలో వచ్చిన లాల్ సింగ్ చద్దా అయితే దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు అమిర్

ఈ ఇయర్ ఖాన్ త్రయంలో మరో ఇద్దరు హీరోలు బాక్సాఫీసుకు దూరంగా ఉన్నారు. అపజయాల పరంపర కొనసాగిస్తున్న..షారుఖ్ ఖాన్ పె‌ద్ద బ్రేక్ తీసుకొని వరసగా సినిమాలు చేస్తున్నాడు. 2022 మొత్తం షూటింగ్‌లకే పరిమితమయ్యాడు. సల్లూ బాయ్ కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ హిందీ డబ్బింగ్‌తో అక్కడి ఆడియన్స్‌కు కనిపించాడు. కానీ ఈ ఖండల వీరుడు ఉన్నా కూడా అక్కడ  ఫలితం లేకుండా పోయింది.

సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ..సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు ఖిలాడి అక్షయ్ కుమార్‌. ఈ ఏడాదిలో ఈయన నటించిన సినిమాలు..భారీ నష్టాలు తీసుకొచ్చాయి. ఆరు సినిమాలు విడుదలైతే..ఒక్క సినిమా కూడా డబ్బులు రాబట్టలేకపోయింది. ఓటీటీలో వచ్చిన అత్రంగిరే ,కట్‌పత్లీ ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్లలో విడుదలైన బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు లాంటి సినిమాలు బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయి.

హృతిక్ రోషన్ విక్రమ్ వేదా,షాహిద్ కపూర్ జెర్సీ, టైగర్ ష్రాప్  ‘హీరో పంతీ 2’, అయుష్మాన్ ఖురానా ‘ఆన్ యాక్షన్ హీరో’, రణ్‌వీర్‌ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, కంగనా రనౌత్ ‘ధాకడ్’, రణ్‌బీర్‌ కపూర్ ‘షంషెరా’, వరుణ్ దావాన్ ‘బేడియా’ లాంటి మూవీస్..ఈ ఇయర్ అంచనాలతో విడుదల అయ్యాయి. అయితే..ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌ను థియేటర్లలోకి రప్పించలేకపోయింది.

మరిన్ని వార్తలు