యూత్‌ఫుల్‌ మ్యాడ్‌ – నాగవంశీ

29 Sep, 2023 01:06 IST|Sakshi

‘‘మ్యాడ్‌’ యూత్‌ఫుల్‌ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్‌లు, ట్విస్ట్‌లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్‌ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు.

రామ్‌ నితిన్, సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్‌ కీలక పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్‌’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్‌ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్‌’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్‌ శంకర్‌.

మరిన్ని వార్తలు