7 Arts Sarayu: వెనక్కి తగ్గిన సరయూ, పోలీస్‌ స్టేషన్‌కు పిటిషనర్‌..

8 Feb, 2022 14:47 IST|Sakshi

బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, ‘7ఆర్ట్స్‌’ సరయూపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్‌ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ ఫిర్యాదు చేశాడు. దీంతో బంజారాహిల్స్‌లో పోలీసులు సరయూతో పాటు ఆమె షార్ట్‌ ఫిల్మ్‌ బృందాన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

చదవండి: యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం 7 ఆర్ట్స్‌ సరయు అరెస్ట్‌..

ఈ క్రమంలో సరయూ బంజారాహిల్స్ పోలీసులకు వివరణ ఇచ్చింది. తన వీడియోలో ఉన్న కంటెంట్‌పై అభ్యంతరాలు ఉంటే, సదరు వ్యక్తులకు క్షమాపణ చెప్పేందుకు సిద్దమని ప్రకటించింది. అంతేకాదు పటిషనర్‌ డిమాండ్స్‌ మేరకు కంటెంట్‌ని తొలగించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ఇప్పటికే ఆ వీడియోలోని అభ్యంతకర సన్నివేశాన్ని ఎడిట్‌ చేసేశామని, ఇంకా అభ్యంతరం అనుకుంటే వీడియో డిలీట్ చేస్తామంటూ సరయూ, ఆమె టీం వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే కాసేపట్లో పిటిషనర్‌ చేపూరి అశోక్‌ సిరిసిల్ల నుంచి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకోనున్నాడు.

చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమే, లేదంటే సహజీవనం: కరాటే కల్యాణి షాకింగ్‌ కామెంట్స్‌

పిటిషనర్‌ వచ్చాక ఇరు వర్గాలను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టనున్నారని సమాచారం. సరయూ ‘7 ఆర్ట్స్’ అనే యూట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తుంది. ఆ ఛానల్ రూపొందించిన అనేక షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. 7ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు.

మరిన్ని వార్తలు