పేదల సంక్షేమమే ధ్యేయం

22 Mar, 2023 01:36 IST|Sakshi
చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 131 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మల్లికార్జున్‌, తహసీల్దార్‌ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌: తహసీల్దార్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పులిమామిడి శివారులోని రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు ఇటీవల రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సీహెచ్‌ తిరుపతి, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌ కుమార్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ బాల్‌రెడ్డి, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఎల్లాగౌడ్‌, ఎంపీపీ హన్మంతు నాయకులు రాంరెడ్డి, సంజన్న, శ్రీనివాస్‌, సమరసింహారెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం పే స్కేల్‌ వర్తింపజేయడంపై మంగళవారం ఊట్కూర్‌లో ఎమ్మెల్యే సమక్షంలో సెర్ప్‌ సిబ్బందితో కలిసి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.

మరిన్ని వార్తలు