ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 26 మంది మృతి

1 Oct, 2022 22:55 IST|Sakshi

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా ఘటమ్‌పూర్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ నీటిలో పడటంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే చంద్రికా దేవి ఆలయాన్ని దర్శించుకుని ఉన్నావ్‌ నుంచి కాన్పూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు