డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక : ఆనంద్ మహీంద్ర రియాక్షన్

8 Sep, 2020 16:51 IST|Sakshi

ప్రస్తుత మహమ్మారి నుండి గట్టెక్కనివ్వండి : ఆనంద్ మహీంద్ర

భయానక  హారర్ సీక్వెల్ లా ఉంది

సాక్షి, ముంబై :  కరోనా మహమ్మారి చివరిది కాదు.. తరువాతి ఉపద్రవానికి మానవజాతి  సిద్ధంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్  హెచ్చరికలపై పారిశ్రామికవేత్త  మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహమ్మారి  సంక్షోభం నుంచి బయటపడనివ్వండి అంటూ  ట్వీట్ చేశారు. మమ్మల్ని మరింత భయ పెట్టకండి అంటూ అభ్యర్థించారు. తేరుకోక ముందే మమ్మల్నందర్నీ మళ్లీ డిప్రెషన్ లో ముంచొద్దంటూ ట్వీట్ చేశారు. (తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!)

దీంతో ఆయన ట్వీట్ కు  యూజర్లనుంచి భారీ స్పందన లభిస్తోంది  రీటీట్లు,  లైక్స్, వ్యంగ్యోక్తులతో హోరెత్తిస్తున్నారు. జనాన్ని భయపెట్టే బదులు డబ్ల్యూహెచ్ఓ పరిష్కారాలు సూచించాలని ఒక యూజర్ కోరారు. భయానక సీక్వెల్స్‌తో ఉన్న హారర్ సినిమాను తలపిస్తోందని మరో యూజర్ వ్యాఖ్యానించగా, డబ్ల్యూహెచ్ఓ సానుకూల వార్తలను ఎపుడు చెప్పింది కనుక అని ఇంకొకరు కమెంట్ చేశారు. కరోనాతో  వారు మేకింగ్ ఫన్ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.  కరోనా విషయంలో అధ్యక్ష ప్రసంగాలు తప్ప టెడ్రోస్ చేసిందేమీ లేదని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.

>
మరిన్ని వార్తలు