Key Events Of India Freedom Struggle: 1869/1947 ఘట్టాలు

13 Jun, 2022 14:02 IST|Sakshi

లక్నోలో లా మార్టినియర్‌ గర్ల్స్‌ కాలేజ్‌ స్థాపన. లా మార్టినియర్‌ కళాశాల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో ఒక ఉన్నతమైన ప్రైవేట్‌ విద్యా సంస్థ. కళాశాలలో బాలురు, బాలికల కోసం వేర్వేరు క్యాంపస్‌లలో రెండు పాఠశాలలు ఉన్నాయి. లా మార్టినియర్‌ బాయ్స్‌ కాలేజ్‌ 1845లో, లా మార్టిని యర్‌ గర్ల్స్‌ కళాశాల 1869లో ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోనే ‘బ్యాటిల్‌ ఆనర్స్‌’ గౌరవాన్ని పొందిన ఏకైక కళాశాల లా మార్టినియర్‌ బాయ్స్‌ కాలేజ్‌! 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో లక్నోను సురక్షితంగా ఉంచడంలో ఈ కాలేజీ పోషించిన పాత్రకు దక్కిన గౌరవం అది. ఫ్రెంచి అడ్వెంచర్‌ మేజర్‌ జనరల్‌ క్లాడ్‌ మార్టిన్‌ ఈ గొలుసు కట్టు కళాశాలల్ని నెలకొల్పారు.

లక్నోలోని ఈ రెండు కాలేజీలు కాకుండా కలకత్తాలో రెండు, ఫ్రాన్స్‌లోని లయోన్‌ ప్రాంతంలో మూడు మార్టినియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఐదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు వారికి ఈ విద్యాలయాలలో తక్కువ ఫీజులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుంది. లక్నోలోని బాలుర పాఠశాల క్యాంపస్‌లో చర్చి, మసీదు, హిందూ దేవాలయం ఉన్నాయి. ప్రసిద్ధ బ్రిటన్‌ పత్రిక ‘ది ఎకనామిస్ట్‌’ ఈ కళాశాల భవనాన్ని.. ‘బహుశా లక్నోలో ఉత్తమంగా సంరక్షించబడిన కాలనీల సామరస్య (కాన్‌స్టాంటియా) భవనం’ గా అభివర్ణించింది. 

చట్టాలు
డైవోర్స్‌ యాక్ట్, ఈస్ట్‌ ఇండియా ఇరిగేషన్‌ అండ్‌ కెనాల్‌ యాక్ట్‌
జననాలు
కస్తూర్బా గాంధీ (పోర్బందర్‌), మోహన్‌దాన్‌ కరంచంద్‌ గాంధీ : (పోర్బందర్‌); భగవాన్‌ దాస్‌ : తత్వవేత్త, స్వాతంత్య్ర సమరయోధులు (వారణాసి); హబీబ్‌ మియా : 138 ఏళ్ల సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఎక్కువ కాలం పింఛను పొందిన వ్యక్తిగా గిన్నిస్‌బుక్‌లో నమోదు అయ్యారు. (జైపుర్‌); వలంగైమన్‌ శంకర నారాయణ శ్రీనివాస శాస్త్రి : విద్యావేత్త, భారత స్వాతంత్య్ర సమర ఉద్యమ కార్యకర్త (వలంగైమన్, తమిళనాడు); ముహమ్మద్‌ హబీబుల్లా : ట్రావంకోర్‌ దివాను (మద్రాస్‌); డాక్టర్‌ ఉమేద్రమ్‌ లాల్‌భాయ్‌ దేశాయ్‌ : ప్రసిద్ధ వైద్యులు (వైరా, గుజరాత్‌).

మరిన్ని వార్తలు