స్వతంత్ర భారతి 1981/2022

5 Jul, 2022 16:56 IST|Sakshi

మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌
ఇండియాలో జన్మించిన బ్రిటిష్‌–అమెరికన్‌ రచయిత సల్మాన్‌ రష్దీని ప్రపంచ ప్రసిద్ధుడిని చేసిన ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’ విడుదలైన ఏడాది ఇది. బ్రిటిష్‌ వలస పాలన నుంచి భారతదేశం ఏ విధంగా స్వాతంత్య్రం సాధించుకుంది, ఎలా రెండు ముక్కలయ్యిందీ ఇందులోని కథాంశం. వాస్తవ చారిత్రక ఘటనలకు తేలికపాటి కల్పనల జోడింపుతో పాఠకుల ముందుకు వచ్చిన ‘మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌’ రష్దీని అత్యున్నతస్థాయి రచయితగా నిలబెట్టింది. ఈ నవలకు బుకర్‌ ప్రైజ్, ‘జేమ్‌ టెయిట్‌ బ్లాక్‌ మెమోరియల్‌ ప్రైజ్‌’ రెండూ ఒకే ఏడాది వచ్చాయి. బి.బి.సి. ‘ది బిగ్‌ రీడ్‌’ పోల్‌లో యూకేలో బెస్ట్‌ లవ్డ్‌ నావెల్‌ జాబితాలో కూడా మిడ్‌నైట్‌ చిల్ట్రన్‌ చోటు సంపాదించుకుంది. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
–ఇన్ఫోసిస్‌ స్థాపన. పుణñ లో ప్రారంభం. 
– తమిళనాడులోని శివకాశిలో ‘అరసన్‌ గణేశన్‌ పాలిటెక్నిక్‌’ స్థాపన. 
–నేషనల్‌ అల్యూమినియం కంపెనీ పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థ అయింది. 

మరిన్ని వార్తలు