-

యాచకురాలి వద్ద 2.58 లక్షలు నగదు 

2 Jun, 2021 04:26 IST|Sakshi

జమ్మూ: 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్‌ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది.

ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్‌ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్‌ సుఖ్‌దేశ్‌ సింగ్‌ సమ్యాల్‌ చెప్పారు. డబ్బు దాచుకున్న యాచకురాలు ఎవరో తెలియదని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిటీ మంగళవారం ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తుండగా.. సంచుల్లో నోట్లు, నాణేలు దొరికాయని అన్నారు. మొత్తం లెక్కించగా రూ.2,58,507 ఉన్నట్లు అధికారులు తేల్చారు. డబ్బును యాచకురాలికే చేరేలా చూస్తామని సుఖ్‌దేశ్‌ చెప్పారు. నిజాయతీతో వ్యవహరించిన మున్సిపల్‌ కమిటీని అభినందించారు

మరిన్ని వార్తలు