-

ఒకేసారి ఐదు సినిమాలు లైన్‌లో పెట్టిన కొత్త హీరో!

28 Nov, 2023 18:52 IST|Sakshi

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ఉపేంద్ర గాడి అడ్డా'. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై  కంచర్ల అచ్యుతరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానున్న సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర మీడియా సమావేశంలో స్పందించారు. 'కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.  

ఓ రోజు వైజాగ్ కళాకారుల పిక్నిక్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అక్కడ నన్ను చూసి ఓ దర్శకుడు కథ చెప్పడం, సినిమాలోకి రావడం జరిగింది. ఈ క్రమంలో ఉపేద్ర గాడి అడ్డా చిత్రాన్ని నిర్మించాం.  యూత్ ఫుల్, మాస్,  ఎంటర్ టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి అందరూ  కనెక్ట్ అవుతారు. ఇందులో ఓ చక్కటి సందేశం కూడా వుంది. ఫోన్ వుంటే, దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఎటువంటి మంచి చెడులు  అనేవి చూపాం. మహిళలు ఏ విధంగా వీటిని యూజ్ చేస్తున్నారు. ఇక సమాజంలో విలువలు ఏ విధంగా వుంటాయి అనేవి చూపించాం. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటన కొద్దిగా నేర్చుకున్నా.

ఆ తర్వాత నా జర్నీ ముందుకు సాగింది. నేను కొత్త హీరోను. ఒకేసారి ఐదు సినిమాలు చేయడం నా లక్‌ అని చెప్పాలి. ప్రస్తుతం '1920 భీమునిపట్నం' సినిమా  నిర్మాణంలో ఉంది. ఇలా కొత్త దర్శకులను, నటీనటులను ప్రోత్సహించాలనే  నిర్మాణ సంస్థను స్థాపించాం. ఉపేంద్ర అడ్డా దర్శకుడిలో క్రియేటివిటీ వుంది. తను చెప్పినట్లు తీయగలిగాడు. చిరంజీవి, ఎన్.టి.ఆర్., పవన్ కల్యాణ్‌ ఇలా ఒక్కో హీరోలో ఒక్కో ప్రత్యేకత వుంటుంది. అందరూ మంచి హీరోలే. నాకంటూ ఓ ప్రత్యేక వుంది. అది డిసెంబర్‌ 1న విడుదలయ్యే ఉపేంద్ర గాడి అడ్డా సినిమా చూస్తే అర్థమవుతుంది. కొత్తవారిని ఆదరిస్తారు.' అని కోరుకుంటున్నట్లు హీరో కంచర్ల ఉపేంద్ర తెలిపాడు.

మరిన్ని వార్తలు