-

అలాంటి సీన్స్‌లో నటించిన భార్య.. భర్త రియాక్షన్‌ ఇదే

28 Nov, 2023 18:22 IST|Sakshi

బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్‌ జోడీగా నటించిన భారీ యాక్షన్‌ చిత్రం టైగర్‌- 3.. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రంపై డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ కలెక్షన్స్‌ పరంగా సుమారు రూ. 450 కోట్లు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.  స్పై యూనివర్స్‌లో భాగంగా గ‌త రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన‌ కత్రినా కైఫ్.. టైగర్ 3 చిత్రంలో కూడా అదిరిపోయే అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించింది. ట‌ర్కీ హ‌మామ్‌లో క‌త్రినా కైఫ్‌పై చిత్రీక‌రించిన ట‌వ‌ల్ ఫైట్ ఇప్పటికీ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

ఈ చిత్రంలో కత్రినా బోల్డ్​ టవల్ ఫైట్ సీక్వెన్స్​ ఇప్పటికీ  ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో బాత్ టవల్స్​ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్​ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్​గా తమ నేక్డ్​ బాడీని కవర్​ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకు భారీగా బజ్‌  క్రియేట్‌ చేశాయి.

తాజాగా కత్రినా కైఫ్‌ భర్త విక్కీ కౌశల్ ఈ సీన్స్‌పై స్పందించాడు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడుతున్నట్లు ఆయన చెప్పాడు. 'నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి మొదటిరోజే చూశాను. ఇందులో యాక్షన్ సీన్స్‌లలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి ఇలా అన్నాను 'ఇక నుంచి నేను నీతో గొడవపడకపోవడమే మంచి అని అనుకుంటున్నాను. లేదంటే నువ్వు టవల్ సాయంతో నన్ను కొట్టావంటే ఇక అంతే.' అని ఫన్నీగా చెప్పాను. బాలీవుడ్‌లో కత్రినా అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. ఇలాంటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న శ్రమకు నేను నిజంగా గర్వపడుతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు