బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అయితే: నాపై ట్రోలింగ్‌, బెదిరింపులు

1 Dec, 2023 17:33 IST|Sakshi

టెలివిజన్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌  షో హిందీ,  తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ మలయాళం సహా ఏడు భాషల్లో ఎంత పాపులర్‌ అందరికీ తెలుసు. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో బాగా జనాదరణ పొందింది.  హిందీలో తొలి  సీజన్ 2006, నవంబరులో మొదలైంది. ముఖ్యంగా ఈ షోలో వినిపించే వాయిస్‌లు  ఈ షోకేపెద్ద ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.

అయితే హిందీ బిగ్‌ బాస్‌కి వాయిస్‌ ఇచ్చే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ , నటుడు విజయ్ విక్రమ్ సింగ్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ప్రముఖ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ప్రకటించిన తర్వాత తనను చాలా ఇబ్బందులు పడుతున్నానంటూ వాపోయారు. కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని విజయ్ విక్రమ్ సింగ్ వెల్లడించారు. అలాగే తమ పిల్లల్ని బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి పంపించమంటూ  ఫోర్స్‌ చేస్తుంటారని  తెలిపాడు

బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విజయ్ విక్రమ్ సింగ్ బిగ్ బాస్‌లో అధికారిక వ్యాఖ్యాతగా తన వాయిస్‌ని ఇవ్వడం వల్ల కలిగే నష్టాల గురించి   తెలిపారు. ఈ షోకి వాయిస్ ఓవర్‌ ఇవ్వడం తనకు పెద్ద డిస్‌అడ్వాంటేజ్‌గా మారిపోయిందనీ, విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపాడు. ముఖ్యంగా కీలకమైన పోటీదారుల ఎలిమినేట్‌ అయినపుడు మరీ దారుణంగా ఉంటుందని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.  తన కుటుంబానికి కొన్ని ప్రత్యక్ష బెదిరింపులు కూడా  వస్తుంటాయని పేర్కొన్నాడు. 

విన్నర్‌కు అసలు అర్హత లేదు అంటూ చాలా సార్లు  కమెంట్లు వినిపిస్తుంటాయి.. కానీ, ఇది టాలెంట్‌  షో కాదు.. కేవలం జనం మెచ్చిన వాళ్లు విజేతలు - విజయ్‌ విక్రమ్‌ సింగ్‌ 

అసలు కంటెస్టెంట్స్‌ను తొలగించేంది తాను కాదని, ఎలిమినేషనకు తనకూ ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నా, పట్టించుకోరన్నారు. ప్రజల ఓట్లే పోటీదారుల తొలగింపునకు దారితీస్తుందని,   మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా  తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదని వ్యక్తం చేశాడు. ఆ వాయిస్‌ తనది కాదన్నా వినరని తెలిపాడు. ప్రస్తుత సీజన్‌కు  విజయ్‌ బదులుగా మరో నటుడు  వాయిస్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్  వాయిస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

బిగ్ బాస్ చాహ్తే హై' అంటూ హిందీ  బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సంభాషణల వాయిస్‌  అతుల్‌  కపూర్‌,  విజయ్‌ సింగ్‌లదే.  బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్  అతుల్ కపూర్ అయితే, షోను వివరించే వాయిస్,  షో రీక్యాప్‌  లాంటి వాటికి వాయిస్‌ ఇచ్చేవారు విజయ్‌.  కాగా 2010లో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌పై వాయిస్ ఓవర్‌తో పాపులర్‌ అయ్యాడు విజయ్‌. ఆతరువాత బీబీకి వాయస్‌తో కొన్ని, వెబ్ షో, సినిమా ఆఫర్లను దక్కించుకున్నాడు.   మనోజ్‌ బాజ్‌పాయ్‌ ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జ్‌తోపాటు,  సుస్మితాసేన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన తాలి,   విక్కీకౌశల్‌ మూవీలోకూడా అవకాశాలు దక్కించుకున్నాడు. 

A post shared by Vijay Vikram Singh (@vijayvikram77)

మరిన్ని వార్తలు